చాలా మంది చికెన్ ఇష్టంగా తింటారు. ఆదివారం వస్తే చాలు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్లు పెరుగుతాయి. కానీ రోజూ తింటే మాత్రం ప్రమాదం. చికెన్, మటన్, చేపలు తిన్న తర్వాత పాలు, పెరుగు, కూల్డ్రింక్స్ తాగొద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలు తాగితే శరీరంలో టాక్సిన్స్ ఏర్పడుతాయి. దీంతో పొత్తికడుపులో నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అల్సర్, వంటి సమస్యలు వస్తాయి.