TG: టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీకి పాల్పడిన అభ్యర్థిని అధికారులు డిబార్ చేశారు. నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో చిట్టీలు తీసుకొచ్చిన అభ్యర్థి కాఫీకి యత్నించగా.. అభ్యర్థిని పట్టుకున్న అధికారులు పరీక్ష నుంచి డిబార్ చేసినట్లు చెప్పారు. మరోవైపు నిన్న సీవీఆర్ కళాశాలలోనూ కాపీకి యత్నించిన అభ్యర్థిని అధికారులు డిబార్ చేశారు.