TG: సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటలు సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నాగోల్ – ఎల్బీనగర్ – హయత్నగర్, ఎల్బీనగర్ – శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.