ELR :ధన్వతరి జయంతి, నేషనల్ ఆయుర్వేద దినోత్సవం సందర్భం గా ఉంగుటూరు విఙ్ఞాన భారతి స్కూల్ లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఉంగుటూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శిరీష విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి, ఆయుర్వేద వైద్యం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కృష్ణ కుమారి ,విజయాలక్మి తదితరులు పాల్గొన్నారు.