ELR: పెదపాడు మండలం ఏపూరిలో శనివారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ కట్టా శారద సతీశ్‌కు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. అనంతరం ఘటనా స్థలంలో రూ.13,820 నగదును స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.