కోనసీమ: అమలాపురం డీఎస్పీ కార్యాలయం వద్ద ఈరోజు జరిగిన పోలీసుల అమరవీరుల దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పోలీసులు వినియోగించే ఆయుధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం విట్స్ విద్యాసంస్థల విద్యార్థులకు ఆయుధాల పనితీరుపై అవగాహన కల్పించారు. అమలాపురం డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.