పాలు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పాలు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా ఉండాలంటే పాలనుండి మీగడను వేరు చేసిన స్కిమ్డ్ మిల్క్ తీసుకోవాలి దీని ద్వారా కేలరీలు దూరం అవుతాయి. ఒక గ్లాసు ప్యూర్ మిల్క్‌లో 146 కేలరీలు ఉంటాయి. అదే స్కిమ్డ్ మిల్క్‌లో అయితే 86 కేలరీలు మాత్రమే ఉండటం వలన బరువు పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయట.