CJI D.Y చంద్రచూడ్ ఆల్ ఇండియా రేడియోతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆల్ ఇండియా రేడియోతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అప్పట్లో తన అమ్మానాన్నలతో కలిసి ఆకాశవాణిలో వచ్చే వార్తలను వింటూ బాల్యం గడిచిందన్నారు. ‘ఆకాశవాణి.. ఈ రోజు వార్తలు చదువుతున్నది’ అంటూ ప్రముఖ న్యూస్ ప్రజెంటర్లు దేవకీ నందన్, పమీలా సింగ్, లోతికా రత్నం లాంటి వారు చెబుతుంటే అలా వింటూ ఉండేవాణ్ని అని, వారి గొంతూ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.