కృష్ణా: అనారోగ్యం బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చేయూతగా నిలుస్తుందని విజయవా ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ. 6 లక్షల 85 వేల రూపాయలు అందజేశారు.