కృష్ణా: విజయవాడలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని కార్మికుడు దుర్మరణం చెందాడు. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ అనే వ్యక్తి వీఎంసీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా చనుమోలు వెంకటరావు ఫ్లైఓవర్ వద్ద లారీ ఢీకొని దుర్మరణం చెందాడు.