TG: పార్టీ ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలకు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కూడా గతంలో అనేక పార్టీలు మారారని కడియం వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఫిరాయింపులు ప్రారంభించిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, అహంకారంతో మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.