మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ.. ఇండియా కూటమిలో భాగమైన మహావికాస్ అఘాడి పార్టీ తరఫున కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌తోపాటు ఆప్ సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, జార్ఖండ్‌లోనూ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.