BHPL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయాన్ని శనివారం తెలంగాణ హైకోర్టు జడ్జి వేణుగోపాల్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భముగా ఆలయ ప్రధాన రాజగోపురం వద్ద అర్చక బృందం జడ్జి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం జడ్జి దంపతులకు ఆలయ పర్యవేక్షకులు బుర్రి శ్రీనివాస్ స్వామి వారి శేష వస్త్రాలు అందజేశారు.