TG: రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎరువులు సరఫరా చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మార్క్ఫెడ్, మార్కెటింగ్ శాఖల అధికారులకు సూచించారు. అలాగే, ధాన్యం, పత్తి, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. మార్క్ఫెడ్ ఆదాయం పెంచే విధంగా చూడాలని, ఏటా పెరిగే ఖర్చుల భారం తగ్గించే విధంగా ప్రయత్నించాలని సూచించారు. పత్తి, ధాన్యం తదితర పంటల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు.