విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. లేదంటే ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.