TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా పార్శిళ్ల హోం డెలివరీని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ద్వారా రేపటి నుంచి పార్శిళ్ల హోం డెలివరీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా హోం డెలివరీ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.