ATP: సింగనమల మండలం నాయన పల్లి క్రాస్ వద్ద శనివారం లారీ, కారును ఢీకొంది. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారని అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.