TG: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బాధితులు ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తాజాగా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈడీకి మరో ఫిర్యాదు చేసింది. ధరణిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే 200 ఎకరాలకు అమోయ్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే అమోయ్ కుమార్తో పాటు ఇతర అధికారులు, పెద్దల పాత్రపై దర్యాప్తు జరపాలని బాధితులు కోరుతున్నారు.