ప్రైవేట్ రంగానికి చెందిన ICICI బ్యాంకు త్రైమాసిన ఫలితాలను వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో బ్యాంకు లాభం రూ.11,746 కోట్లు నమోదైంది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.10,261 కోట్లతో పోలిస్తే 14.5 శాతం వృద్ధి చెందింది. దీంతో మొత్తం ఆదాయం రూ.40,697 కోట్ల నుంచి రూ.47,714 కోట్లకు చేరినట్లు బ్యాంకు తెలిపింది. వడ్డీ ద్వారా ఆదాయం రూ.34,920 కోట్ల నుంచి రూ.40,537 కోట్లకు చేరినట్లు పేర్కొంది.