MNCL: మంచిర్యాల సాయినగర్‌లో వేడి సాంబారులో పడి తీవ్రంగా గాయపడిన మూడేళ్ళ దుర్గా వరుణ్ బాబు వైద్య చికిత్సకు కాంగ్రెస్ నాయకులు చేయూత అందించారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడి వైద్య చికిత్సకు రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆందోళన చెందవద్దని బాలుడి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.