ప్రభాస్ నటించిన ‘బాహుబలి 1’ రిలీజైన తొలి రోజు నెగటివ్ టాక్ రావడంపై సినీ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘బాహుబలి1 రిలీజైన తొలి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. సినిమా బాగాలేదని, తమ అంచనాలను అందుకులేకపోయిందని చెప్పారు. ఆ తర్వాతి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెల్లవారుజామున వేసే షోలు ఎప్పుడూ రిస్కే. ఆ సమయంలో వారు అంచనాలతో వెళ్లి.. వేరే కోణంలో మూవీ చూస్తారు. అది సెట్ కానప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి’ అని పేర్కొన్నారు.