AP: మాజీ మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను వంచించి రాజకీయాలు చేయడమే CM చంద్రబాబు నైజం అని ఆరోపించారు. ఎన్నికల హామీలు అమలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. అలాగే, NTR మరణానికి కారకులు ఎవరో కూడా ‘ఆహా’ షోలో చంద్రబాబు, బాలకృష్ణ చెబితే బాగుండేది అంటూ కామెంట్స్ చేశారు. రాబోయే ఐదేళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి.. అడ్డగోలుగా రూ.6,072 కోట్లు విద్యుత్ ఛార్జీల పేరుతో బాదబోతున్నారన్నారు.