AP: కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల లేఖపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే వైఎస్ షర్మిల పనిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని, షేర్ల బదిలీతో వైసీపీ అధినేత జగన్కు ఇబ్బందులు వస్తాయని తెలిసి చేశారని మండిపడ్డారు. జగన్ బెయిల్ రద్దు చేయడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు.