TG: MLC జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయానని ఆయన అన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా జగిత్యాల ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే తన అనుచరుడు గంగారెడ్డిని కోల్పోయానని ఆవేదనకు గురయ్యారు. కాగా, ఇప్పటికే ఈ విషయమై అధిష్టానానికి ఆయన లేఖ రాశారు.