కోనసీమ: అమలాపురం మండలం పాలగుమ్మిలో డ్వాక్రా మహిళలు చెల్లించిన స్త్రీనిధి సొమ్మును ఇద్దరు వీవోఏలు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 56 గ్రూపుల సంబంధించిన సుమారు రూ.70 లక్షల సొమ్ము ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై ఏజీఎం ప్రసన్నలక్ష్మి పూర్తిస్థాయిలో విచారించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.