సినీ హీరో జయంరవితో నటి ప్రియాంకా మోహన్ నిశ్చితార్థం జరిగిందంటూ గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఆ వార్తలపై ప్రియాంక స్పందించింది. వాటిలో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలు చూసి షాక్ అయ్యానని తెలిపింది. కాగా, వీరిద్దరూ జంటగా నటించిన ‘బ్రదర్’ మూవీ నుంచి రిలీజైన ఓ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. దీంతో ఆ ఫొటోను చూసి ఈ జంటకు నిశ్చితార్థమైందన్న చర్చ మొదలైంది.