AP: సరస్వతి పవర్ భూములపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడారు. సరస్వతి పవర్ భూముల్లో అటవీ భూమి ఎంత ఉందనే అంశంపై ఆయన ఆరా తీశారు. జల వనరులున్నాయా? పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ అనుమతులు ఎలా ఇచ్చారో తెలపాలని పీసీబీ అధికారులను ఆదేశిచ్చారు. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ భూములపై త్వరలో సమీక్ష నిర్వహించనున్నారు.