ప్రకాశం: కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువాజిపేట సెక్టార్ సమావేశం సూపర్వైజర్ ఎంవిఎస్ పార్వతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడి చిన్నారుల పట్ల కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు.