NLR: మనుబోలు మండలంలోని పిడూరు గ్రామంలోని గిరిజనులు తాగునీటి కోసం శుక్రవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. గ్రామంలో 50 గిరిజన కుటుంబాలు ఉన్నాయని వారు చెప్పారు. కాలనీలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడంతో 15 రోజులుగా పంచాయతీ కుళాయిలలో తాగునీరు సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అధికారులకు తెలిపినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని చెప్పారు.