TG: హైడ్రా ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్ సస్పెన్షన్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. సీఎస్ శాంతికుమారి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.