TG: స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ చివరి నాటికి స్పోర్ట్స్ పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు. బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని రూపొందించాలన్నారు. మరో పది రోజుల్లో గవర్నింగ్ బోర్డు ఫైనల్ చేయాలని సూచించారు. వీలైనంత త్వరగా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలకు సంబంధించి స్పోర్ట్స్ క్యాలెండర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.