TG: కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఛైర్మన్ పదవి కోసమే గంగారెడ్డి హత్య జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ హత్య చేయించారని జీవన్ రెడ్డి చెప్తున్నారు. కానీ, ఇప్పటివరకు ఎస్పీ అతని మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం హత్యా రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారని, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అని ధ్వజమెత్తారు.