TG: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మహబూబ్‌నగర్ క్రిస్టియన్ పల్లి శివారులోని 523 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విక్రయించిన ఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. ఇందులో ముగ్గురు అరెస్టు కాగా, శ్రీకాంత్ గౌడ్ బెయిల్ కోసం పలు కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేదు. దీంతో శ్రీనివాస్ గౌడ్ స్వయంగా రూరల్ PSలో శ్రీకాంత్ గౌడ్‌ను దించి వెళ్లినట్లు సమాచారం.