మూసీ సుందరీకరణ అని ఊదరగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి మాతో కలిసి మూసీ పర్యటనకు రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితుల్లో ఒక్కరు ఒప్పుకున్నా నిరసనలను విరమించుకుంటామన్నారు. బాధితులకు బంజారాహిల్స్లో స్థలాలు ఇచ్చి, అప్పుడు వారి ఇళ్లను కూల్చాలని, అప్పటి వరకు ఇటుక కదిలించినా ఒప్పుకోమని వెల్లడించారు.