రాజకీయాల్లోకి రావడంపై మెగా హీరో సాయి ధరమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని, మరెన్నో విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించాలని అనుకుంటున్నానని చెప్పాడు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి రావాలని లేదని, అందులోకి రావాలనే ఎన్నో విషయాలను నేర్చుకోవాలని తెలిపాడు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నాడు.