SKLM: శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ శుక్రవారం గార మండల MRO కార్యాలయం వద్ద ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామపంచాయతీలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.