ELR: జిల్లాలో మహిళల భద్రతకు జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. ఇంటి నుంచి మహిళలు బయటకు వచ్చేటప్పుడు, దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే వారి సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అదే విధంగా వాట్సాప్ నంబర్ 95503 51100కు వివరాలు పంపిస్తే, ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తూ ఉంటామని అన్నారు. మహిళల భద్రత ప్రభుత్వం, పోలీసుల యొక్క బాధ్యత అన్నారు.