దేశంలో వాయు కాలుష్యంపై వివిధ రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ‘వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడటం, మార్నింగ్ వాక్కు వెళ్లడం పరిమితం చేయాలి. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. ఈ మేరకు ‘వాతావరణ మార్పు- మానవులపై ప్రభావం’ జాతీయ కార్యక్రమం చేపట్టి ప్రజలకు అవగాహన కలిగించాలి’ అని సూచించింది.