AP: తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ పలు సూచనలు చేసింది. ‘బీపీ, షుగర్, మూర్ఛ, కీళ్ల వ్యాధులు ఉన్న 60 ఏళ్ల వృద్ధులు.. గుండె సమస్యలు ఉన్నవారు నడకదారిలో రావద్దు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు మందులు వెంట తెచ్చుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే 1500 మెట్టు, గాలి గోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద సహాయం పొందవచ్చు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తిరుపతిలోని స్విమ్స్‌లో డయాలసిస్ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని టీటీడీ తెలిపింది.