నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్-4 ప్రారంభమైంది. ఈ షోకి రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చరణ్, దిల్ రాజు ఈ షోలో పాల్గొనబోతున్నారట. వచ్చే వారం ఇందుకు సంబంధించిన షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ రాత్రి 8:30 గంటలకు ‘ఆహా’లో ఈ షోలో AP సీఎం చంద్రబాబు పాల్గొన్న ఎపిసోడ్ రిలీజ్ కానుంది.