తిరుపతి: గత ప్రభుత్వంలో విశాఖ శారద పీఠానికి సంబంధించి టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. మఠం విస్తీర్ణంలో భాగంగా శారదపీఠం తిరుపతిలో స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో వివాదం తలెత్తింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గత టీటీడీ బోర్డు తీర్మానాన్ని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.