ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరట లభించింది. ఇప్పటివరకు అతడిపై ఉన్న ‘కెప్టెన్సీ’ నిషేధాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎత్తివేసింది. 2018లో సాండ్‌పేపర్ స్కాండల్ నేపథ్యంలో వార్నర్ ‘జీవితకాల నాయకత్వం’పై నిషేధం పడింది. తనపై బ్యాన్‌ను తొలగించాలని వార్నర్ విజ్ఞప్తి చేయగా.. ముగ్గురితో కూడిన రివ్యూ ప్యానెల్ సమీక్షించి ఏకగ్రీవంగా నిర్ణయాన్ని ప్రకటించింది.