KMM: బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన నేతల అరెస్టులు తప్పవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత సర్కారులో కీలక నేతలు నంబరు 1 నుంచి 8 వరకు అందరినీ అరెస్టు చేస్తామని ప్రకటించారు. గురువారం నాటి సియోల్ పర్యటనలో ఈ అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన ప్రముఖులకు సంబంధించిన ఫైళ్లు సిద్ధం అయిందన్నారు.