బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై బెదిరింపులు, రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసుతో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై NIA రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అతని గురించి సమాచారమిస్తే రివార్డు ఇస్తామని తెలిపింది. 2022లో నమోదైన 2 కేసుల్లో అన్మోల్‌పై చార్జిషీట్ దాఖలైంది. సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అతను చాటింగ్ చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు.