WNP: మున్సిపాలిటీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహంకాళి ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రం నుండి హైదరాబాద్ సీఎం కార్యాలయం ముట్టడికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.