అమెరికాలోని బాల్టిమోర్‌లో డాలి నౌక ఢీకొట్టడంతో ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు చనిపోవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోవడంతో సింగపూర్ కార్గో షిప్‌పై అమెరికా దావా వేసింది. దీంతో రూ.840 కోట్ల నష్టపరిహారం చెల్లింపునకు సదరు కంపెనీ తాజాగా అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖ తెలిపింది.