NZB: వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కాల్వలు, భవనాల పనులకు ప్రతిపాదించిన పనులను నాణ్యతతో, వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వశాఖల ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, సమావేశం నిర్వహించారు. జిల్లాలో కురిసిన వర్షాలతో రోడ్లు, కాల్వలు, తదితరపనులకు ఆయాశాఖలు మరమ్మత్తులకు ప్రతిపాదించడం జరిగిందని అన్నారు.