ప్రకాశం: కొరిశపాడు మండలం మేదరమెట్లలోని పలు దుకాణాలలో గురువారం తూనికలు కొలతల ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తనిఖీలు నిర్వహించారు. బియ్యం బ్యాగుల బరువు, ఎలక్ట్రికల్ కాటా మిషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మేదరమెట్లలో ముద్ర లేని ఐదు కాటాలను గుర్తించామని అన్నారు. వారిపై చట్టపరంగా కేసు నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.