రాష్ట్రంలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. తాజాగా మన్యం జిల్లా పార్వతీపురం, పెద్దబొండపల్లిలో గజరాజుల దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా దేవాబత్తుల యాకోబుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. దీంతో యాకోబు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో జరిగిన ఏనుగుల దాడుల్లో పది మంది మృతి చెందారు.