గుంటూరు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థిని మృతిని నిరసిస్తూ బుధవారం SFI ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. విద్యార్థిని మృతి పట్ల కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తక్షణమే చైతన్య స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని సూచించారు.